పంచాయితీ మొత్తం బోర్లు రేపేర్లు, బోర్ల ప్లేట్లు మరమ్మత్తు చేయిస్తున్న సర్పంచ్..నాగమణి

Screenshot_20260318_205622_WhatsApp.jpg

పంచాయితీ మొత్తం బోర్లు రేపేర్లు, బోర్ల ప్లేట్లు మరమ్మత్తు చేయిస్తున్న సర్పంచ్..నాగమణి

-కూనవరం :-మండలంలోని పెద్దార్కూర్ గ్రామంలో ఉన్న మంచి నీటి బోర్ల సమస్యను పరిష్కరించారు స్థానిక సర్పంచ్ నాగమణి.రానున్న వేసవి కాలం దృష్టిలో ఉంచి మంచి నీటి సమస్య తలెత్తకుండ ఉండాలని స్థానిక సర్పంచ్ అన్నారు. గ్రామ పంచాయితీ లో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న బోర్లకు మరమ్మత్తు చేసి మంచినీరు అందించారు. స్థానికంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ మడకం బొజ్జి, పాయం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

y.sarath Kumar (Ysk)

Verified by MonsterInsights