**స్థానిక ప్రజలకు తెలియకుండా చిడుమూరులో మైనింగ్ నిర్వహణకు కసరత్తులు*
**పిసా గ్రామసభ నిర్వహించకుండా ప్రజలతో తెల్ల పేపర్ పై సంతకాలు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోండి*
ఐటీడీఏ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
బుధవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)ఆధ్వర్యంలో పలు సమస్యలపై చింతూరు ఐటీడీఏ పీజిఆర్ఎస్ నందు ఏపీవో వారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ చింతూరు మండలం చిడుమూరు గ్రామం వద్ద సర్వే నెంబర్ వన్ బై పి నందు నాలుగు హెక్టార్లలో నల్లరాయి, గ్రావెల్ క్వారీ మైనింగ్ నిర్వహించడానికి ట్రైబల్ బినామీ పేరుతో అనుమతులు ఇవ్వటానికి అధికారులు చూస్తున్నారని ఈ అనుమతులు ప్రక్రియ తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. స్థానిక ప్రజలకు, రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం తెలియకుండా, పిసా గ్రామసభ తీర్మానం చేయకుండా స్థానిక వీఆర్వో ,సర్వేర్లు మరియు మండల రెవెన్యూ అధికారులు , పంచాయతీ కార్యదర్శి తెల్ల పేపర్లపై ప్రజల తోటి సంతకాలు చేయించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ఏపీవో కు వివరించారు. మైనింగ్ నిర్వహించాలని చూస్తున్న కొండ చుట్టూ చిడుమూరు, పాలగూడెం, కన్నాపురం, వీరాపురం గ్రామాలకు చెందిన ఆదివాసీల పట్టా భూములు, సాగు భూములు ఉన్నాయని వీరెవరికి తెలియకుండా మైనింగ్ నిర్వహించాలని చూస్తున్నారని కావున దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బినామీ వ్యక్తులకి మైనింగ్ లీజు పర్మిషన్ ఇప్పించాలని చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం ప్రకారం భూములపై సర్వ హక్కుల ఆదివాసులకే ఉంటాయని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్ 11/2021 ఉత్తర్వులు ఆధారంగా షెడ్యూల్ గ్రామాల పరిధిలో రీ సర్వే ద్వారా నాన్ ట్రైబల్స్ కి ఎటువంటి హక్కులు కల్పించవద్దని ఆయన వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పలు కారణాల చేత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన నగదు రానివారికి తక్షణమే ప్రభుత్వం ద్వారా వచ్చే నగదు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది. స్పందించిన ఏపీ వో సంబంధిత అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరించేల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రకటన ద్వారా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో కారం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
కుంజా శ్రీను
ఆదివాసి సంక్షేమ పరిషత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
y.sarath Kumar (Ysk)
