Country: ఆంధ్రప్రదేశ్
రంపచోడవర: 02/02/2026
**స్వయంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు, కానీ చర్యలు లేవు -రాజవొమ్మంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ బి నాగ సుశీలను తక్షణమే సస్పెండ్ చేయాలి*
**ప్రజలకు శాపంగా మారిన మైనింగ్ లపై, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి*
పి జి ఆర్ ఎస్ నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఫిర్యాదు.
సోమవారం నాడు పోలవరం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఐటిడిఏ రంపచోడవరం నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఇన్చార్జ్ జెసి మరియు ప్రాజెక్టు అధికారి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పిఓ గారికి వినతుల గురించి తెలియజేస్తూ గత నెల 25వ తారీకు నాడు రాజవొమ్మంగి మండలం కేంద్రంలో అయిన గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రాత్రి భోజన సమయంలో రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిర్యాల శిరీష దేవి స్వయంగా పర్యవేక్షణ చేసి హాస్టల్లో మధ్యాహ్నం వండిన భోజనాన్ని రాత్రిపూట పెట్టడం జరిగిందని, వార్డెన్ కూడా అందుబాటులో లేరు అని ఆహారము అస్సలు బాగోలేదని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫోన్లు అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నారు. ఇదే విషయంపై ఆదివాసి సంక్షేమ పరిషత్ కూడా దర్యాప్తు చేయగా ప్రభుత్వం జారీ చేసిన మెనూ ప్రకారం వార్డెన్ బి నాగ సుశీల పిల్లలకు అందించడం లేదని, డ్యూటీ సక్రమంగా చేయటం లేదని, ఆహారాల పురుగులు వస్తున్నాయి, చాలీచాలని అన్నం పెట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని కాబట్టి వార్డును తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన కోరారు, అదేవిధంగా రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో గల నల్లరాయి క్వారీలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని, బాధితులకు సరైన న్యాయం జరగటం లేదని స్థానిక అధికారులు తప్పుడు నివేదికల తోటి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. రంపచోడవరం మండలంలో ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుపై ఆక్రమణలు తొలగించడం లో ఆదివాసులకు ఒకలాగా నాన్ ట్రైబల్ కి ఒకలాగా చర్యలు తీసుకుంటున్నారని, ఆదివాసి ఆక్రమణలు లను భయపెట్టి బలవంతంగా తొలగించలా చేస్తున్నారని, నాన్ ట్రైబల్స్ ఆక్రమణకు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారని జాగారంపల్లి జంక్షన్ వద్ద ఉన్న దాబా హోటల్ విషయంలో బీకాం సాయి అనే నాన్ ట్రైబల్ అక్రమ కట్టడం విషయంలో ఆర్ అండ్ బి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని తక్షణమే ఆ హోటల్ని తొలగించాలని ఆయన పిఓ గారికి వినతిపత్రం ఇచ్చారు. అలాగే పోలవరం జిల్లా వ్యాప్తంగా గుర్తించిన అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని గౌరవ న్యాయస్థానాలు మరియు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ వారి నోటీసుల ఆధారంగా 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల సమస్యలు పరిష్కరించడనికి క్షేత్రస్థాయిలో కిందిస్థాయి అధికారులు సరిగా పనిచేయటం లేదని ఉన్నత అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి అధికారులు సరిగా పనిచేయకపోవటం వల్ల సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. రంపచోడవరం ఎమ్మెల్యే తనిఖీలు చేసి రాజవోమంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అక్రమాలను గుర్తించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదంటే ఆదివాసి ప్రజాప్రతినిధులు అంటే చులకన లేదంటే దీని వెనక మరేదైనా ఉందా అని ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఏజెన్సీలో మైనింగ్ మాఫియా అదివాసులను పట్టిపీడిస్తున్నాయని, మైనింగ్ రెవెన్యూ అధికారులు మైనింగ్ మాఫియాతో కుమ్మక్కై ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలను గుర్తించలేకపోతున్నారని ఏజెన్సీలో కొనసాగుతున్నటువంటి మైనింగ్లపై సమగ్ర విచారణ జరపాలని అవన్నీ కూడా బినామీ మైనింగ్ లేఅని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేపరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, డివిజన్ అధ్యక్షులు మోడీద నూకరాజు, కంగాల అబ్బాయి దొర, శివ, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
కుంజ శ్రీను
ఆదివాసి సంక్షేమ పరిషత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
y.sarath Kumar (Ysk)
