FOOD

GOOD HEALTH WITH GOOD FOOD

Horse Gram Health Benefits: ఉలవలు తింటే.. ఈ అనారోగ్యాలు దూరం అవుతాయ్..!

ఉలవలు.. వీటిని పశువులకు దానగా మాత్రమే పెడతారని చాలా మంది అనుకుంటారు. ఉలవలను చాలా తక్కువ మంది మాత్రమే వారి డైట్‌లో తీసుకుంటూ ఉంటారు. ఉలవలతో చారు, వలడలు ఇలా చాలా రకాల డిషెస్‌ తయారు చేసుకోవచ్చు. ఒక సారి ఉలవచారు టేస్ట్‌ చేస్తే.. అసలు వదిలి పెట్టం. ఉలవలలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్‌ ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌, జింక్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో యాంటీ-అడిపోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-హైపర్గ్లైసీమిక్, యాంటీ-హైపర్ కొలెస్ట్రాలెమిక్ లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలం ఉలవలు మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Verified by MonsterInsights