Country: ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గవర్నమెంట్ మోడరన్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన భారీ జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు యంగ్ అండ్ డైనమిక్ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది ఆడమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను ఆయన చేతుల మీదుగా ఇవ్వటం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అక్కడికి విచ్చేసిన కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తమను ఎంపిక చేయటం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు
Please follow and like us:
y.sarath Kumar (Ysk)
