జంగారెడ్డిగూడెం మండలం వేగవరం హాస్పిటల్‌లో తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న మద్దిపాటి ఏడుకొండలు వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని కలిసి సహాయం కోరగా, వెంటనే స్పందించిన శాసనసభ్యులు నిమిషం ఆలస్యం చేయకుండా రూ.3 లక్షల 40 వేల విలువైన ఎల్ఓసి లెటర్‌ను అందజేశారు.
అంతేకాకుండా “జాగ్రత్తగా వైద్యం చేయించండి.. ఏ అవసరం వచ్చినా వెంటనే కార్యాలయానికి సమాచారం ఇవ్వండి” అని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పంపించారు.
ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ, అవసరమైన సమయంలో వెంటనే స్పందిస్తూ మానవత్వంతో ముందుకు సాగుతున్న శాసనసభ్యుల సేవాభావాన్ని కుటుంబ సభ్యులు అభినందించారు.
y.sarath Kumar (Ysk)
