తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 38వ కార్యకర్తల సమావేశంలో భాగంగా కావలి నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.

1001075688.jpg

ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత పటిష్టం చేయడం, కార్యకర్తలతో సమన్వయం పెంపొందించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించాము.

పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి నిజమైన బలం. కార్యకర్తల ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో మరింత కట్టుబాటుతో ముందుకు సాగుతాము.

ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

మద్దిపాటి వెంకట రాజు

గోపాలపురం ఎమ్మెల్యే

#TDP #NaraChandrababuNaidu #MaddipatiVenkataRaju #Kavali #TeluguDesamParty #AndhraPradesh

y.sarath Kumar (Ysk)

Verified by MonsterInsights