*✊పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పయనిద్దాం దేశ భవిష్యత్తును కాపాడుకుందాం……..*
*ఆయన వర్ధంతి సభలో సున్నం రాజులు పిలుపు*
వి ఆర్ పురం మే 19:- అమర జీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆలోచన విధానం ఈ దేశ భవిష్యత్తుకు అవసరమని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో పయనించాలని ఈరోజు జరిగిన ఆయన వర్ధంతి సభలో రంపచోడవరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం రాజులు పిలుపునిచ్చారు.
ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ముందుగా విఆర్ పురం లో ఉన్నటువంటి ఆయన స్తూపం వద్ద పార్టీ కార్యకర్తలు అభిమానులు చేరుకుని జోహార్ సుందరయ్య,సాధిస్తాం మీ ఆశయాలు అని నిందించడం జరిగింది.పార్టీ సీనియర్ నాయకులు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సోయం.చినబాబు జెండా ఆవిష్కరణ చేసారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్న మట్టపల్లి ఎంపిటిసి పూనెం.ప్రదీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఆయన వర్ధంతి సభలో సున్నం రాజులు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర సుందరయ్యది అని అంతేకాకుండా ఆనాడు కుల వివక్షతను రూపుమాపి ప్రజలందరితో ఎలా కలిసి బ్రతకాలో సుందరయ్య నేర్పించారని, వ్యవసాయ కార్మికులకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వ్యవసాయ కార్మికులందరికీ దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాలు ఎలా నడపాలి అనేది ప్రజలకు నేర్పించారని, మూఢనమ్మకాలు వదిలి శాస్త్రీయ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలని ప్రజలకు నేర్పిన మహా మేధావి అని ఆయన అన్నారు. అదేవిధంగా శాసనసభ,పార్లమెంట్ నేతలు ప్రజలకు జవాబుదారితనంగా,నిరాడంబరంగా ఎలా ఉండాలో సైకిల్ పై పార్లమెంటుకు వచ్చి పార్లమెంట్ లో మాట్లాడి చూపించిన మహా నాయకుడని,ఈరోజు ఈ దేశంలో ఏర్పడ్డ నిరుద్యోగం, ప్రజల ఆర్థిక అసమానతలను రూపుమాపాలంటే సుందరయ్య ఆలోచన విధానం అవసరమని, నేటి యువతకు ఆయన జీవితం ఒక ఆదర్శమని, స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్ కార్యదర్శి వర్గ సభ్యులు కారం సుందరయ్య పంకు సత్తిబాబు ఎంపీపీ కారం లక్ష్మి పార్టీ మండల నాయకులు గుండెపుడి లక్ష్మణరావు తుర్రం బాబురావు, పోడియం శ్రీరామ్మూర్తి, కుంజ నాగిరెడ్డి ఆసు లక్ష్మయ్య కారం సత్తిబాబు వడ్లది రమేష్, కమ్మ చిచ్చు సత్యనారాయణ, సిహెచ్ సుబ్బారావు, సోడి రమాదేవి, సున్నం భద్రమ్మ, ఆత్మకూరి కాంతారావు, పండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
y.sarath Kumar (Ysk)
