*మండల ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పధకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన MLA డా. కామినేని శ్రీనివాస్ గారు.*

Screenshot_20260318_160140_WhatsApp.jpg

*మండల ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పధకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన MLA డా. కామినేని శ్రీనివాస్ గారు.*

ఈరోజు గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు మండవల్లి మండలం లోకుమూడి గ్రామములో మండల ప్రాధమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పధకాన్ని NDA నాయకులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కామినేని గారు పాఠశాలలో పిల్లలు తింటున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసారు. ప్రతి రోజు పెడుతున్న భోజనం మెనూను మరియు భోజనం రుచి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించె భోజనంలో నాణ్యత లోపం జరగకుండా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

y.sarath Kumar (Ysk)

Verified by MonsterInsights