*భర్త కష్టంతో చదివి ఎస్సై అయిన భార్య… ‘ధోతీ–పిలక నా హోదాకు అవమానం’ అంటూ విడాకుల డిమాండ్!*
భోపాల్ ఫ్యామిలీ కోర్టులో నమోదైన ఓ విచిత్రమైన విడాకుల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పౌరోహిత్యం వృత్తి చేసే భర్త తన భార్య భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తూ ఆమెను చదివించి, పోలీస్ శాఖలో ఎస్సై (SI) ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించాడు.
అయితే ఉద్యోగం వచ్చిన అనంతరం భార్య ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని భర్త కోర్టును ఆశ్రయించాడు. తాను ధోతీ కుర్తా ధరించడం, పిలక ఉంచుకోవడం తన హోదాకు అవమానకరమని భార్య భావిస్తోందని, అదే కారణంగా విడాకులు కోరుతోందని భర్త వాదించాడు.
ఈ కేసులో కోర్టు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా భార్య తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. భర్త వృత్తి, సంప్రదాయాలే తన సామాజిక స్థితికి అడ్డుగా మారుతున్నాయని ఆమె కోర్టు ఎదుట స్పష్టం చేసింది.
సంప్రదాయం ఆధునికత, వ్యక్తిగత గౌరవం కుటుంబ విలువల మధ్య సంఘర్షణను ప్రతిబింబించే ఈ ఘటనపై సమాజంలో విస్తృత చర్చ జరుగుతోంది. భర్త త్యాగానికి విలువ లేకుండా పోయిందా? లేక వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇవ్వాలా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సామాజిక వేదికలపై హాట్ టాపిక్‌గా మారాయి.
K Laitha