*ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు జంగా రెడ్డి గూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత రంగ నాధన్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలపై జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.వి. సుభాష్ గారి ఆధ్వ ర్యంలో తడికల పూడి ప పోలీస్ స్టేషన్ పరిధి లో నిర్వహించిన విస్తృత అవగాహన సదస్సులో ప్రజా రక్షణే ధ్యేయం నూతన చట్టాలు, సైబర్ నేరాలపై తడికలపూడి పోలీసుల చైతన్య సదస్సు తడికల పూడి ఎస్ఐ శ్రీమతి కె. వల్లి పద్మ గారు తమ సిబ్బందితో కలిసి స్థానిక ప్రజలు, మహిళలతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు*.
👉మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు సామాజిక భద్రత, ఆర్థిక సైబర్ మోసాలు మరియు నూతన చట్టాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో క్షుణ్ణంగా వివరించారు.
👉దేశంలో అమలులోకి వచ్చిన నూతన చట్టాలలో భారతీయ న్యాయ సంహిత మహిళలు మరియు చిన్నారుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఎస్ఐ వల్లి పద్మ గారు వివరించారు.
👉మహిళలపై జరిగే వేధింపులు, గృహ హింస, మరియు ఈవ్ టీజింగ్ వంటి నేరాలకు నూతన చట్టాల ప్రకారం కఠినమైన శిక్షలు పడేలా నిబంధనలు ఉన్నాయని, మహిళలు తమ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏ ఆపద వచ్చినా డయల్ 112 లేదా 181 హెల్ప్ లైన్లను ఆశ్రయిం చవచ్చని తెలిపారు.
👉ప్రస్తుతం అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పార్సిల్ స్కామ్స్, లోన్ యాప్స్, పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసాలకు పాల్పడు తున్నారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు తమ బ్యాంక్ ఓటీపీ లు, వ్యక్తిగత వివరాలు చెప్పకూడదు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే, పోగొట్టుకున్న సొమ్మును వెనక్కి రప్పించే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు.
👉వేసవి కాలంలో చాలామంది ఉక్కపోత తట్టుకోలేక ఇళ్లకు తాళాలు వేయకుండా రాత్రి పూట బయట, మిద్దెలపై పడుకుంటూ ఉంటారు. దీనిని దొంగలు ఆసరాగా చేసుకునే అవకాశం ఉంది. ఇళ్లకు పటిష్టమైన లాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని, ఊర్లకు వెళ్లేటప్పుడు నమ్మక మైన పొరుగువారికి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందిం చాలని సూచించారు.
👉 గ్రామంలో నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చని తెలిపారు.
👉రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి.
మద్యం సేవించి వాహనాలు నడపడం రాంగ్ రూట్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ మరియు మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు.
*పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం అందు బాటులో ఉంటుంది. గ్రామాల్లో నేర రహిత వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రజలు, మహిళలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి అని ఎస్ఐ వల్లి పద్మ గారు స్పష్టం చేశారు.
*ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.*
y.sarath Kumar (Ysk)
