ఊరి బడిలో విద్యార్థులను చేర్పిద్దాం-ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందాం :- యు. టి. ఎఫ్.
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫేడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నాలుగు మండలాల ప్రాంతీయ కార్యవర్గ సమావేశం పోలవరం జిల్లా సహాధ్యక్షులు సోడె. నాగేశ్వరావు గారి అధ్యక్షతన యు. టి. ఎఫ్. భవన్ లో నిర్వహించడం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా గౌరవ అధ్యక్షులు పండా. కిష్టయ్య గారు మాట్లాడుతూ బడిఈడు కలిగిన పిల్లలందరూ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించే దాని కోసం ఉపాధ్యాయులుగా మనం ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు ప్రభుత్వ బడి పట్ల నమ్మకాన్ని కల్గించే బాధ్యతలు తీసుకోవాలని, సమాజం వద్దకు వెళ్దాం. ప్రభుత్వ పాఠశాలను పరిరక్షిద్దాం. ఈ పనిలో ఉపాధ్యాయ మిత్రులందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమం లో కూనవరం మండల అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులు ఎ. నాగేశ్వరావు, పి. కన్నారావు, చింతూరు మండల అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులు బి. ముత్తయ్య, మం. సోమరాజు, వి. ఆర్. పురం మండల ప్రధాన కార్యదర్శి యన్. జగదీష్, గౌరవ అధ్యక్షులు. యన్. రామకృష్ణ, కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్ యన్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
y.sarath Kumar (Ysk)
