*పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండ*
- *నిర్వాసితుల ఖాతాల్లో రూ: 250కోట్ల నగదు జమా చేసిన ప్రభుత్వం*
*ఇప్పటి వరకు 27,146 మంది లబ్ధిదారులకు మూడు విడతల్లో రూ;1943.51 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం*
*నిర్వాసితులకు చెక్కు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు*
*పోలవరం నిర్వాసితుల కళ్ళల్లో ఆనందం*
*పోలవరం నిర్వాసితుల పరిహారం సాధనలో ఎమ్మెల్యే శిరీషాదేవి కృషి అమోఘం*
👉*ఎమ్మెల్యే,రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి*
పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు పరిహారం చెల్లించే క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రంప చోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి పరిహారం అందకపోవటంపై ఆమె పలుమార్లు అసెంబ్లీలో గళం విప్పారు. దీనిలో భాగంగా బుధవారం ఉగాది పండుగ కానుకగా నిర్వాసితులకు *గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు* *మరియు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడుల* చేతులు మీదుగా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందించారు. ఈ విడతలో రూ:250 కోట్లు రూపాయలు నిధులు విడుదల చేశారు. ఈమేరకు ఆయన చేతులు మీదుగా చెక్ అందజేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గతేడాది *జనవరిలో సంక్రాంతికి ల్యాండ్ ఎక్విటేషన్ కింద 3706 మంది లబ్ధిదారులకు 198.39 కోట్లు రూపాయలు, మరియు R&R ఎన్ టైటిల్మెంట్స్ కింద 8653మంది లబ్ధిదారులకు రూ 453.34 కోట్ల రూపాయలు మరియు R&R కాలనీలకు గాను రూ; 148.98 కోట్ల రూపాయలు వెరసి రూ:800.71 కోట్ల రూపాయలు12,359 మంది లబ్ధిదారులకు అందజేయడమైంది.*
*రెండో దఫాగా అక్టోబర్ నెలలో దీపావళికి ల్యాండ్ ఎక్విటేషన్ కింద రూ; 12, 222మంది లబ్ధిదారులకు గానూ రూ:778.72కోట్లు మరియు R&R ఎన్ టైటిల్మెంట్స్ కింద 653 మంది లబ్ధిదారులకు రూ: 35.39కోట్లు మరియు R&R కాలనీలకు రూ;101.58 కోట్లు వెరసి రూ:916.19కోట్లు నిధులు మంజూరు చేశారు*
*ప్రస్తుతం ఉగాది కానుకగా ల్యాండ్ ఎక్విటేషన్ కింద 1754 మంది లబ్ధిదారులకు రూ: 198.22 కోట్ల రూపాయలు మరియు R&R ఎన్ టైటిల్మెంట్స్ కింద 158 మంది లబ్ధిదారులకు 4.39 కోట్ల రూపాయలు R&R కాలనీలకు గాను రూ: 24.00 కోట్లు వెరసి 1912 మంది లబ్ధిదారులకు రూ: 226.61 కోట్లు రూపాయలు నిధులు విడుదల చేశారు.*
. *ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి హయంలోనే పై మూడు విడతలుగా నిర్వాసితులకు పరిహారం అందటం వెనుక ఆమె కృషి ఉంది. ఇప్పటి వరకూ మూడు విడతలుగా 27,146 మంది లబ్ధిదారులకు 1943.51 కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేశారు*
ఇదంతా కేవలం తెదేపా, కూటమి ప్రభుత్వం హయంలో ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి హయంలో మాత్రమే నిర్వాసితులకు పరిహారం చెల్లింపులకు పెద్దపీట పడింది. తప్పా గత వైకాపా ప్రభుత్వం హయాంలో నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులకు అండగా ఉండేది కూటమి ప్రభుత్వమే అని మరొక్కసారి రుజువైంది.
ఇదిలా ఉండగా గతంలో ఇల్లు కట్టుకోడానికి రూ;2.85 లక్షలు ఉండేది ఇప్పుడు దానిని రూ;3.57 లక్షలకు పెంచారు .
హౌస్ సైట్ కంపెన్సేషన్ కింద గతంలో రూ;1 లక్ష ఉండేది ఇప్పుడు దానిని రూ;2.లక్షలు చేసారు .
ఈ మేరకు బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ఆమెతో పాటు VR పురం మండల పార్టీ అధ్యక్షులు బొర్రా నరేష్ కుమార్, కూనవరం మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు, చింతూరు నుంచి సోడే సత్యవతి, మడకం రుక్మిణి, ముచ్చిక రుచిత, కట్టం అరుణకుమారి, ముత్యాల సిద్ధార్థ, మడకం రాజు, చెలకాని ఉమా మహేశ్వరరావు, హెచ్ రవి, కారం దారయ్య, ముత్తయ్య, కట్టం వెంకటేష్, చిన్ని , రవిచంద్ర ప్రసాద్, పలువురు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
y.sarath Kumar (Ysk)
