*శ్రీచైతన్య టెక్నో స్కూల్ , భాష్యం స్కూల్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి…*
*ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్*
*డిమాండ్….*
ఏలూరు జిల్లా చింతలపూడిలో విద్యా సంవత్సరం మొదలుకాకుండానే ప్రవేశాలు నిర్వహిస్తున్న
శ్రీచైతన్య టెక్నో స్కూల్,భాష్యం స్కూల్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక శ్రీచైతన్య టెక్నో స్కూల్, భాష్యం విద్యాసంస్థలను సందర్శించగా అక్కడ అడ్మిషన్స్ నిర్వహించడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా శివకుమార్, రాజు మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రవేశాలు నిర్వహించడం సరికాదన్నారు.
పాఠ్యపుస్తకాలు ,యూనిఫామ్, టై,బెల్ట్,లు అధిక ధరలకు అమ్ముతు, ఫీజులు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫిజులు వసూలు చేయడం అంటే విద్య హక్కు చట్టానికి తూట్లు పొడవడమే అని విమర్శించారు.
పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదవాలంటే వేల రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య సంవత్సరం ప్రారంభం కాకముందే అక్రమంగా అడ్మిషన్స్, నిర్వహిస్తూ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, టై,బెల్ట్, అమ్ముతున్నా విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన చింతలపూడి మండలం విద్యాశాఖ అధికారి ( ఎంఈఓ ) మాత్రం కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాయటం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని
శ్రీచైతన్య టెక్నో స్కూల్,భాష్యం స్కూల్, విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకొని, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పై విచారణ చేసి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోలేని పక్షంలో జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు కార్యాలయం వద్ద ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు రవికిరణ్, ఆకాష్, సునీల్ పాల్గొన్నారు.
y.sarath Kumar (Ysk)
